![]() |
![]() |

బీబీ జోడి ప్రతీ వారం సరికొత్త డ్యాన్సస్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ ని కూడా ఈ షోలోకి తీసుకొస్తున్నారు మేకర్స్.. భానుశ్రీ-రవికృష్ణ, అఖిల్-తేజస్వి, అవినాష్-అరియానా, ఆర్జే సూర్య-ఫైమా, వాసంతి-అర్జున్ కళ్యాణ్ ఇలా ఇప్పటివరకు కొన్ని జంటలు డాన్సులు చేస్తూ వస్తున్నాయి. మెహబూబ్‌కి జోడీగా అషు ఇలా కనిపించి అలా ఫారెన్ ట్రిప్ కి వెళ్లిపోయేసరికి అతను సింగిల్ ఐపోయాడు. సైడ్ డాన్సర్‌తో మెహబూబ్ డాన్స్ చేస్తుంటే.. జడ్జెస్ తరుణ్, రాధ, సదా ఒప్పుకోకపోయేసరికి.. ఈసారి సీజన్ 6 ఫైనలిస్ట్ శ్రీసత్యని తీసుకొచ్చి ఆమెతో స్టెప్‌లు వేసాడు మెహబూబ్. అలాగే మరో రెండు జోడీలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. సీజన్ 6 మిస్టర్ పర్ఫెక్ట్ రోహిత్, తన భార్య మెరీనాతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు.
ఫైనల్ గా సీజన్ 2 విన్నర్.. కౌశల్, అభినయశ్రీతో కలిసి జోడీగా వచ్చాడు. రావడంతోనే తేజస్వికి, కౌశల్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఉన్న అన్ని జోడీస్ లో మెహబూబ్ తర్వాత కొంచెం బాగా పెర్ఫార్మ్ చేస్తున్న జంట అఖిల్-తేజస్వి. వాళ్ళు రంగస్థలం మూవీలోని సాంగ్ కి డాన్స్ చేశారు..ఐతే కౌశల్ వాళ్లకి 5 మార్కులు ఇచ్చి తానే పాత గొడవల్ని మళ్ళీ పైకే తవ్వుకొచ్చాడు. " బిగ్ బాస్‌లో నీకు నాకు పడలేదు.. నువ్వు వెళ్లిపోయావ్.. దాన్ని నేను మనసులో పెట్టుకుని ఇది చేస్తున్నానని అనుకోవద్దు’ అని కౌశల్ అనేసరికి.. ‘అది అసలు నాకు గుర్తే లేదు కౌశల్’ అని పరువు తీసేసింది తేజస్వి. కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ గెలిచేంతవరకూ మంచి పేరే ఉంది కానీ.. బయటకు వచ్చాకే అసలు కౌశల్ అంటే ఏమిటో అందరికీ తెలిసింది.
బిగ్ బాస్ హౌస్ లో గెలిస్తే ఆ వచ్చే ప్రైజ్ మనీ మొత్తం క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇస్తానని చెప్పాడు కానీ అలా చేయలేదు. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పటికి బిగ్ బాస్ జోడీలో కనిపించి.. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మళ్ళీ అలాంటి గొడవలనే స్టార్ట్ చేసాడు. ఇక బిగ్ బాస్ పులిహోర రాజా అఖిల్ మీద అద్దిరిపోయే పంచ్ వేసింది సదా. కౌశల్‌ని చూసాక అఖిల్ మళ్లీ రన్నరప్ అవుతానేమో అనుకుంటున్నాడు మనసులో అని చెప్పేసరికి అఖిల్ ముఖం వాడిపోయింది. ఇక ఇలా రేపు సంక్రాంతి నాడు ఈ ఎపిసోడ్ రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
![]() |
![]() |